Sreesanth : లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) పేసర్ శ్రీశాంత్(Sreesanth), ఇండియన్ క్యాపిటల్స్(India Capitals) ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ సోషల్‌మీడియా వేదికగా గంభీర్‌ను విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టడంతో మరింత అగ్గి రాజుకుంది. అయితే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు పంపించారు.
శ్రీశాంత్ కాంట్రాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని. అందుకే నోటీసులు పంపామని కమిషనర్ తెలిపారు. నెపంతో అంతేకాదు సోషల్‌మీడియాలో అతడు పెట్టిన అన్ని పోస్ట్‌లు తొలగించేంత వరకూ ఎలాంటి చర్చలు జరపబోమని ఎల్ఎల్సీ కమిషనర్ తేల్చి చెప్పారు.
ఎల్ఎల్సీ ఎలిమినీటేర్లో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ తనను ఫిక్సర్.. ఫిక్సర్ అని తిట్టాడని అందుకనే అతడిని కోపంగా చూశానని శ్రీశాంత్ తెలిపాడు. ‘నేను గంభీర్ ఒక్క చెడ్డ మాట కూడా అనలేదు. నువ్వు ఏం అంటున్నావు అని అతడిని అడిగానంతే. కానీ, గౌతీ మాత్రం పదే పదే నన్ను ఫిక్సర్ ఫకింగ్ ఫిక్సర్ అంటూ దుర్భాషలాడాడు’ అని మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ వెల్లడించాడు.
శ్రీశాంత్(Sreesanth) వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో గంభీర్ వరుసగా సిక్స్, ఫక్షర్ బాదాడు. దాంతో, శ్రీశాంత్ అతడి వైపు కోపంగా చూశాడు. అందుకు ప్రతిగా గంభీర్ కూడా శ్రీశాంత్వైపు కొరకొరా చూశాడు. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరూ మరోసారి వాగ్వాదానికి దిగారు. దాంతో, ఆన్‌ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకొని ఇద్దరికీ సర్ధిచెప్పారు. అయితే.. మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ సోషల్ మీడియాలో గంభీర్ టార్గెట్‌గా పలు పోస్ట్‌లు పెట్టాడు. కానీ, గౌతీ మాత్రం.. ‘ప్రపంచమంతా అటెన్షన్‌గా ఉన్నప్పుడు నవ్వూతూ ఉండాలి’ అని ఒకే ఒక ఇన్‌స్టా పోస్ట్‌తో సరిపుచ్చాడు.
— Nihari Korma (@NihariVsKorma) December 7, 2023
టీమిండియా పేసర్‌గా రాణిస్తున్న సమయంలోనే శ్రీశాంత్ ఫిక్సింగ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2013 ఐపీఎల్ ఎడిషన్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో, బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది. అక్కడితో అతడి కెరీర్ మరుగునపడింది. ఈ మధ్యే కేరళ కోర్టు శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. ప్రస్తుతం ఈ పేసర్ అంతర్జాతీయ టీ20 లీగ్స్‌లో ఆడుతున్నాడు.