England : దిగ్గజ క్రికెటర్ల తనయులు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్న రోజులవి. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) చిన్న కుమారుడు అండర్-19 జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్(ODI Series) కోసం ఎంపిక చేసిన జట్టులో రాకీ చోటు దక్కించుకున్నాడు. దాంతో, విధ్వంసక బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచిన రాకీ ఫ్లింటాఫ్(Rocky Flintoff) తొలిసారి ఇంగ్లండ్ జెర్సీ వేసుకోబోతున్నాడు.
కుడిచేతి వాటం బ్యాటర్ అయిన రాకీ తండ్రి ఫ్లింటాఫ్ మాదిరిగానే పుల్ షాట్స్ ఆడడంలో దిట్ట. లాంక్షైర్ జట్టు తరఫున సెంచరీ బాదిన పిన్న వయస్కుడిగా ఫ్లింటాఫ్ రికార్డు బద్ధలుకొట్టిన రాకీ.. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు.
2005 x 2024
Andrew Flintoff and his 16-year-old son, Rocky, share a near identical batting technique 🤯
Look at those pull shots! 😮pic.twitter.com/wFrbJCFjs8
— Wisden (@WisdenCricket) April 24, 2024
ప్రస్తుతం 16 ఏండ్ల వయసున్న రాకీ అండర్-19 జట్టు తరఫున దంచికొట్టాలని తహతహలాడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 28న జరిగే తొలి మ్యాచ్‌తో సిరీస్ ఆరంభం కానుంది.