న్యూఢిల్లీ: ప్రఖ్యాత హాకీ ఆటగాడు చరణ్‌జిత్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన వయసు 90 ఏళ్లు. చరణ్‌జిత్ సారథ్యంలోనే ఇండియన్ జట్టు 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. పద్మశ్రీ చరణ్‌జిత్ ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు క్రీడా మంత్రి తన ట్విట్టర్లో వెల్లడించారు. జలంధర్‌లో హాకీ స్టార్‌కు తుది వీడ్కోలు పలకనున్నారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలుమినిస్లో ఆయన ఉన్నారు. 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్‌లో ఇండియా సిల్వర్ మెడల్ గెలిచింది. ఆ జట్టులో కూడా చరణ్‌జిత్ సభ్యుడిగా ఉన్నారు. పంజాబ్ పోలీసు విభాగంలో ఆయన పనిచేశారు. హాకీ మాజీ దిగ్గజాలు కల్నల్ బల్బీర్ సింగ్, పరాగత్ సింగ్, సురీందర్ సోధిలు ఆయన మృతి పట్ల నివాళి అర్పించారు.
देवभूमि हिमाचल के ऊना में जन्मे पूर्व भारतीय हाकी खिलाड़ी व कप्तान श्री चरणजीत सिंह जी का देवलोकगमन दुखदाई है। आपका देहावसान खेल जगत की एक बहुत बड़ी क्षति है।
— Anurag Thakur (@ianuragthakur) January 27, 2022
चरणजीत जी के नेतृत्व में ही भारतीय टीम ने 1964 में टोक्यो ओलंपिक में स्वर्ण पदक जीता था।खेल में उन्हें असाधारण प्रतिभा.. pic.twitter.com/oCowoRjSWl