Zimbabwe : జింబాబ్వే జట్టు స్వదేశంలో అప్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. టోర్నీకి మరో ఐదు రోజులే ఉండడంతో సికిందర్ రజా (Sikandar Raza) సారథిగా పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. అనుభవజ్ఞులతో పాటు యువకులకు చోటు కల్పించారు. ఇటీవలే నిషేధం ముగియడంతో వన్డేల్లో పునరాగమనం బ్రెండన్ టేలర్ స్క్వాడ్‌లోకి రాగా.. లెగ్ స్పిన్నర్ గ్రేమీ క్రెమర్ (Graeme Cremer) సైతం జట్టులోకి వచ్చాడు.
2018లో చివరి మ్యాచ్ ఆడిన గ్రేమీకి.. శుక్రవారం ప్రకటించిన 15 మంది స్క్వాడ్‌లో చోటు దక్కింది. జింబాబ్వే, అఫ్గనిస్థాన్‌ల మధ్య మూడు టీ20ల సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 31న రెండో మ్యాచ్, నవంబర్ 2న మూడో టీ20 జరుగనున్నాయి.
Zimbabwe name squad for T20I series against Afghanistan
Details 🔽https://t.co/iZFe1ohitH pic.twitter.com/iW0sT4VgdO
— Zimbabwe Cricket (@ZimCricketv) October 24, 2025
జింబాబ్వే స్క్వాడ్ : సికిందర్ రజా(కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, రియాన్ బర్ల్, గ్రేమీ క్రెమెర్, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదండే, టినొటెండా మపోస, తడివనషె మరువానీ, వెల్లింగ్టన్ మసకజ్ద, టోనీ మున్యోంగా, తషింగ మసెకివా, బ్లెస్సింగ్ ముజరబని, డియాన్ మయర్స్, రిచర్డ్ గరవ, బ్రెండన్ టేలర్.