SAW vs ENGW : మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa)ను ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్(2/15) తిప్పేయడంతో ప్రధాన ప్లేయర్లు డగౌట్‌కు చేరారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన సఫారీలు మిడిల్ ఓవర్లలో తడబడ్డారు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(42) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆఖర్లో సీనియర్ ఆల్‌రౌండర్ మరినే కాప్(19) రాణించడంతో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన దక్షిణాఫ్రికాకు ఇంగ్లండ్ బౌలర్లు షాకిచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని తొలి ఓవర్ నుంచే ఎదురు దాడికి దిగిన ఓపెనర్ తంజిమ్ బ్రిస్ట్(13)ను లిన్సే స్మిత్ పెవిలియన్ పంపింది. 31 పరుగులకే తొలి వికెట్ పడినా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(42) పట్టుదలగా ఆడింది.
Some valuable runs at the death take South Africa to a decent total, but England ought to be happy with that score 🤝
🔗 https://t.co/11nB7okUN5 | #T20WorldCup pic.twitter.com/M5a04ndFDp
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2024
అనికె బొస్చ్(18), మరినే కాప్(19)లతో విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. అర్ధ శతకం దిశగా దూసుకెళ్తున్న ఆమెను సోఫీ ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేసింది. అక్కడితో సఫారీ స్కోర్ నెమ్మదించింది. ఆఖరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన మరినే కాప్ 3 ఫోర్లతో విరుచుకు పడింది. మరో ఎండ్‌లో అన్నేరియే డెర్క్సెన్(20) సైతం ధనాధన్ ఆడడంతో దక్షిణాఫ్రికా మోస్తరు లక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్దేశించగలిగింది.