SL vs NZ 1st Test : శ్రీలంక గడ్డపై న్యూజిలాండ్ (Newzealand) దీటుగా ఆడుతోంది. గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ టామ్ లాథమ్(70), మాజీ సారథి కేన్ విలియమ్సన్(55)లు అర్ధ శతకాలతో రాణించారు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఉరికించారు. డారిల్ మిచెల్(41 నాటౌట్), టామ్ బండెల్(18 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా ఆడారు. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్ పరుగులు చేసింది. ఇంకా 50 రన్స్ వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య లంక 305 పరుగులకు ఆలౌటయ్యింది.
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్(70), డెవాన్ కాన్వే(17)లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు పరుగులు జోడించారు. అయితే.. వికెట్ తీసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత లాథమ్ జతగా విలియమ్సన్ లంక బౌలర్లకు పరీక్ష పెట్టాడు. రెండో వికెట్‌కు విలువైన 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Another fifty for Kane, but he couldn’t make it a big one in Gallehttps://t.co/c36K1kauJJ #SLvNZ pic.twitter.com/m886fy5zAF
— ESPNcricinfo (@ESPNcricinfo) September 19, 2024
అర్ధ శతకం పూర్తి చేసుకున్న లాథమ్‌ను ప్రభాత్ జయసూర్య ఔట్ చేసిన కాసేపటికే కేన్ మామను కెప్టెన్ ధనంజయ డిసిల్వా బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన రచిన్ రవీంద్ర(39) కాసేపు క్రీజులో నిలబడ్డాడంతే. డారిల్ మిచెల్(41 నాటౌట్), టామ్ బ్రండెల్(18 నాటౌట్)లు అద్భుతంగా ఆడి న్యూజిలాండ్‌ను గట్టెక్కించారు.
ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసిన శ్రీలంక సొంతగడ్డపై మాత్రం తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఆనందం తొలి సెషన్లోనే ఆవిరైంది. కివీ యువ పేసర్ విలియం ఓరూర్కే ధాటికి ఓవల్ శతక హీరో పథుమ్ నిశాంక(27)తో పాటు దిముత్ కరుణరత్నే(2), దినేశ్ చండీమాల్(30), ఆంజెలో మాథ్యూస్(36)లు చేతులెత్తేసిన చోట కమిందు మెండిస్ (114) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.
కమిందు మెండిస్ (114)
క్రీజులో కుదురుకున్నాక తనదైన షాట్లతో అలరించిన ఈ యువకెరటం అద్భుత శతకంతో చెలరేగాడు. ఒకదశలో 178కే సగం కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడిన లంకను ఒడ్డున పడేశాడు. కుశాల్ మెండిస్(50)తో కలిసి పట్టుదలగా ఆడి సెంచరీ భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 300 దాటించాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసిన లంక రెండో రోజు మరో మూడు పరుగులకే ఆలౌట్ అయింది.