Lasith Malinga : పొట్టి ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక పటిష్టం చేసుకుంటోంది. ఈసారి ట్రోఫీని పట్టేయాలనుకుంటున్న లంక ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ మీదా దృష్టి సారించింది. ఇటీవలే భారత జట్టు మాజీ కోచ్ ఆర్.శ్రీధర్ (R Sridhar)ను ఫీల్డింగ్ కోచ్‌గా తీసుకున్న లంక క్రికెట్ మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెటరన్ బౌలర్ లసిత్ మలింగ (Lasith Malinga)ను తమ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టంట్గా నియమించుకుంది.
వచ్చే ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుంది. టోర్నీకి మరో 39 రోజులే ఉన్నందున శ్రీలంక క్రికెట్ బోర్డు లసిత్ మలింగ సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవమున్న అతడిని కొన్ని రోజులకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 25 వరకే మలింగ సవేలు అందించనున్నాడు.
⚡️ Lasith Malinga has been appointed as the 𝐂𝐨𝐧𝐬𝐮𝐥𝐭𝐚𝐧𝐭 𝐅𝐚𝐬𝐭 𝐁𝐨𝐰𝐥𝐢𝐧𝐠 𝐂𝐨𝐚𝐜𝐡 of Sri Lanka’s men’s team on a short-term basis.
His tenure is effective from December 15 to January 25, helping with preparation for the T20 World Cup in February-March… pic.twitter.com/DypUe7o1hV
— Cricbuzz (@cricbuzz) December 30, 2025
‘అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం, డెత్ ఓవర్లలో ప్రమాదకరమైన మలింగ సేవల్ని శ్రీలంక క్రికెట్ ఉపయోగించుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అతడి అవసరం మాకుంది. టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్నందున మలింగ మా పాస్ట్ బౌలర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు’ అని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పేసర్లకు శిక్షణనిస్తున్న ఈ మాజీ యార్కర్ కింగ్ ఈసారి తన దేశానికి సేవలందించనున్నాడు.
శ్రీలంక పేస్ దిగ్గజమైన లసిత్ మలింగ ఒకప్పుడు తన పదునైన యార్కర్లతో బ్యాటర్లకు వెన్నులో వణుకుపుట్టించాడు. టీ20ల్లో వరుసగా నాలుగు వికెట్లతో చరిత్ర సృష్టించిన ఈ మాజీ పేసర్.. అంతర్జాతీయ కెరీర్లో 500లకు పైగా వికెట్లు పడగొట్టాడు. అతడి కెప్టెన్సీలోనే లంక 2014లో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అనంతరం.. ఐపీఎల్లో ముంబై విజయాల్లో కీకలమయ్యాడీ స్పీడ్‌స్టర్.