ఢిల్లీ : అండర్-23 రెజ్లింగ్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారతకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బిష్కెక్ (కిర్గిస్థాన్) వేదికగా సోమవారం నుంచి మొదలైన ఈ టోర్నీలో భాగంగా జరిగిన యువ రెజ్లర్ లలిత్ సత్తాచాటగా పసిడి పతకం తెస్తారని ఆశించిన అమన్ సెహ్రావత్, సునీల్ కుమార్ నిరాశపరిచారు. పురుషుల 55 కిలోల గ్రీకో రోమన్ ఈవెంట్ సెమీస్‌లో లలిత్.. 11-3తో హొయింగ్ షి (చైనా)ను మట్టికరిపించి ఫైనల్‌కు అర్హత సాధించాడు.
23 ఏండ్ల ఈ కుర్రాడు.. ఫైనల్లో ఇఖ్తియొర్ బొటిరొవ్ (ఉజ్బెకిస్థాన్)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా 77 కిలోల గ్రీకో రోమన్ క్యాటగిరీలో అమన్, మాజీ చాంపియన్ సునీల్ కుమార్ (87 కిలోలు) మాత్రం సెమీస్‌లో ఓడి కాంస్య పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.