Lalit Modi : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ (Lalit Modi) వరుసగా భారత క్రికెట్‌కు సంబంధించిన సంచలన విషయాలు పంచుకుంటున్నాడు. ఈమధ్యే హర్భజన్ సింగ్ – శ్రీశాంత్ చెంపదెబ్బ (Slapegate) వీడియోతో వార్తల్లో నిలిచిన లలిత్.. ఈసారి టీమిండియా స్టార్‌కు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చానని వెల్లడించాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ పాడ్‌కాస్ట్’ బియాండ్23’లో మాట్లాడుతూ.. 2007 టీ20 వరల్డ్ కప్ అనంతరం యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కు ‘పోర్షే'(Porsche) కారును ప్రదానం చేసిన విషయాన్ని బహిర్గతం చేశాడు లలిత్. అసలు తాను ఎందుకు అలా చేశాడో తెలుసా..?
‘నేను భారత క్రికెటర్లకు భారీ ఆఫర్ ప్రకటించాను. బ్యాటర్లు ఎవరైనా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టినా.. బౌలర్లు ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసినా వాళ్లకు పోర్షే కారు గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాను. అయితే.. 2007 పొట్టి ప్రపంచ కప్ వరకూ ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ, యువరాజ్ సింగ్ అందర్నీ ఆశ్చర్యపరస్తూ ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చరిత్ర సృష్టించాడు. అంతే.. ఇచ్చిన మాటకు కట్టుబడి అతడికి పోర్షే బహూకరించాను’ అని లలిత్ మోడీ అప్పటి సంఘటనను వివరించాడు. అంతేకాదు ఇంగ్లండ్ ప్రధాన పేసర్ స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో యూవీ ఆరు సిక్సర్లు బాదిన రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడీ ఐపీఎల్ మాజీ ఛైర్మన్.
Lalit Modi: “Before the 2007 T20 WC, I promised a Porsche for 6 sixes or 6 wickets in an over. After his 6 sixes, Yuvraj asked, ‘Where’s my Porsche?’ I said, ‘Give me your bat.’” (Beyond23 Podcast) pic.twitter.com/veawseKN13
— ShubhamSports8 (@ShubhamSports8) August 31, 2025
‘సూపర్ 8 స్టేజ్‌లో ఇంగ్లండ్, భారత్ తలపడ్డాయి. ఆ రోజు చరిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ బౌండరీ అవతల ఉన్న నా వైపు చూశాడు. ఆరు సిక్సర్లు కొట్టిన తర్వాత నేను సాధించాను అన్నట్టుగా నావైపు బ్యాట్ చూపించాడు. అంతేనా.. ఇన్నింగ్స్ పూర్తయ్యాక పరుగెత్తుతూ నా వద్దకు వచ్చి నాకు పోర్షే కావాలి. నా పోర్షే ఎక్కడ? అని నాతో అన్నాడు. అతడలా అంటుంటే నేను నవ్వుతూ ఒకే .. నీ బ్యాట్ నాకు ఇవ్వు అని అన్నాను’ అని పద్దెనిమిదేళ్ల క్రితం నాటి సంఘటనను నెమరువేసుకున్నాడు మోడీ.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
YUVRAJ SINGH HAMMERED 6 SIXES IN AN OVER AGAINST STUART BROAD ON THIS DAY 17 YEARS AGO…!!! 🥶🇮🇳pic.twitter.com/Gb9LPkoSKC
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2024
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి ఎడిషన్ పొట్టి వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. బ్రాడ్ ఓవర్లో సిక్సర్లతో హోరెత్తించిన యూవీ.. ఈ ఫార్మాట్లో వేగవంతమైన ఆర్ధశతకం బాదడమే కాకుండా టీమిండియా ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డునూ ఎగరేసుకుపోయాడు.