లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్లో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య చెలరేగిన వివాదం తాలూకు వీడియోను నాటి చైర్మన్ లలిత్ మోడీ తాజాగా బయటపెట్టాడు. ‘స్లాప్ గేట్’ వివాదంగా పిలిచే ఈ ఘటన ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖెల్ క్లార్క్ ‘బియాండ్23 పాడ్‌కాస్ట్’లో మాట్లాడుతూ లలిత్ ఇందుకు సంబంధించిన వీడియోను 18 ఏండ్ల తర్వాత ప్రపంచం ముందుంచాడు.
‘ఇరు జట్ల మధ్య మ్యాచ్ ముగిసింది. కెమెరాలూ ఆఫ్ అయ్యాయి. కానీ నా వద్ద ఉండే సెక్యూరిటీ కెమెరా ఒకటి ఆన్‌లోనే ఉంది. అందులో శ్రీశాంత్, భజ్జీ వివాదం రికాైర్డెంది. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో భజ్జీ.. శ్రీశాంత్ చెంపపై బలంగా కొట్టుకుంటూ ముందుకెళ్లాడు. దీనిని నేను చాలాకాలంగా దాచి ఉంచాను’ అని చెప్పాడు.