Lakshya Sen : ఈ ఏడాది భారత షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) తొలి టైటిల్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)ఫైనల్లో విజేతగా నిలిచాడు. సిడ్నీలో జరిగిన సూపర్ 500 టోర్నమెంట్లో జపాన్‌కు చెందిన యుషీ తనకను(Yushi Tanaka)ను చిత్తు చేశాడీ స్టార్ ప్లేయర్. వరుస సెట్లలో జోరు చూపించిన సేన్ యుషీని మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ పూర్తయ్యాక విమర్శకులకు కౌంటర్ ఇస్తూ సెలైంట్ సెలబ్రేషన్ చేసుకున్నాడీ విన్నర్.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన లక్ష్యసేన్ టైటిల్‌తో మెరిశాడు. సెమీఫైనల్లో కఠినమైన ప్రత్యర్థి చౌ థియెన్ చెన్ ఆట కట్టించిన సేన్ ఫైనల్లోనూ తడాఖా చూపించాడు. 14వ సీడ్ అయిన భారత షట్లర్ ఫైనల్లో తనకంటే తక్కువ ర్యాంకర్ అయిన యుషీ తనకపై అలవోకగా గెలుపొందాడు. ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన అతడు 21-15తో తొలి సెట్ గెలుచుకున్నాడు. రెండో సెట్లోనూ ప్రత్యర్ధికి అవకాశమివ్వకుండా అటాకింగ్ గేమ్ ఆడిన సేన్.. 21-11తో షాకిచ్చాడు.
LAKSHYA SEN WINS AUSTRALIAN OPEN🤩🥹
He totally demolished Yushi Tanaka of Japan 🇯🇵 in straight sets 21-15, 21-11 in Men’s Singles! 💪
First Title of the Year 2025 for Lakshya 🏆
THE SENSATION SEN IS TRULY BACK! 🇮🇳💙pic.twitter.com/f7rDkfbcbP
— The Khel India (@TheKhelIndia) November 23, 2025
మ్యాచ్ గెలుపొందిన తర్వాత సేన్ తన చెవుల్లో చేతివేళ్లను పెట్టుకొని విజయాన్ని ఆస్వాదించాడు. అనంతరం కోచ్ యూ యాంగ్ సుంగ్, తండ్రి డీ.కే.సేన్‌తో కలిసి సంబురాలు చేసుకున్నాడు. టైటిల్ విజేతగా నిలిచిన కుమారుడిని ఆయన ఎత్తుకొని మరీ అభినందించాడు. ఈ ఏడాది సేన్‌కు ఇదే మొదటి టైటిల్. ఇటీవలే అతడు జపాన్ మాస్టర్స్‌లో సెమీస్‌లోనే వెనుదిరిగాడు. హైలో ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు.