Kumamoto Masters : భారత యువ షట్లర్ లక్ష్య సేన్(Lakshya Sen) ఈ సీజన్లో చెలరేగిపోతున్నాడు. జపాన్‌లో జరుగుతున్న కుమమొటో మాస్టర్స్ (Kumamoto Masters )లో అదిరే ఆటతో సెమీస్‌కు దూసుకెళ్లాడు. ప్రీ-క్వార్టర్స్‌లో సింగపూర్ షట్లర్ జియా హెంగ్ జాసన్‌ను చిత్తు చేసిన అతడు.. శుక్రవారం మాజీ వరల్డ్ ఛాంపియన్ లోహ్ కీన్ యూ (Loh Kean Yew)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ద్వారా పురుషుల సింగిల్స్‌లో భారత ఆశలను సజీవంగా ఉంచిన అతడు ఇప్పుడు సెమీస్ చేరి పతకానికి మరింత చేరువయ్యాడు.
ఏడోసీడ్ అయిన లక్ష్యసేన్ కుమమొటో మాస్టర్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రీ-క్వార్టర్స్‌లో 39 నిమిషాల్లోనే జియా హెంగ్‌ను మట్టికరిపించిన అతడు.. మాజీ వరల్డ్ ఛాంపియన్ లోమ్ కీన్ యూను చిత్తు చేశాడు. తొలి సెట్‌ను 21-13తో గెలుపొందిన సేన్ ఆ తర్వాత కూడా జోరు చూపించాడు. రెండో సెట్లో ప్రత్యర్దిని నిలురించి 21-17తో విజేతగా నిలిచాడు సేన్. ఫైనల్ బెర్తు కోసం జపాన్ స్టార్ కెంటా నిశిమొటో (Kenta Nishimoto)తో భారత షట్లర్ తలపడనున్నాడు.
🚨 LAKSHYA SEN STUNS WORLD NO.9. 🔥
India’s Lakshya defeated Loh Kean Yew 21-13, 21-17 to move into SF of Japan Masters! 💪
That’s a dominating win, WELL DONE! 🇮🇳pic.twitter.com/HQZTiL4U5c
— The Khel India (@TheKhelIndia) November 14, 2025