వాంటా (ఫిన్లాండ్): అర్క్టిక్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రత్యర్థి రాస్మస్ జెమ్కె వాకోవర్‌తో లక్ష్యసేన్ తదుపరి రౌండ్ లో నిలిచాడు. ఇటీవలి పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకం చేజార్చుకున్న లక్ష్యసేన్..రెండో రౌండ్లో ఏడోసీడ్ చైనీస్ తైపీ షట్లర్ చో టీన్ చెన్‌తో తలపడనున్నాడు. మరో సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 23-21, 21-18తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై విజయంతో ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-19, 24-22తో సంగ్ షు యున్పైగెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.