Hong Kong Open : హాంకాంగ్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen) ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో దూకుడైన ఆటతో చౌ థియెన్ చెన్( Chou Tien-chen)ను అతడు చిత్తుగా ఓడించాడు. ఆరో సీడ్ అయిన తైవాన్ ప్లేయర్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ రెండు సెట్లలో జయభేరి మోగించాడీ యంగ్‌స్టర్. తద్వారా మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు సేన్. నాలుగో ర్యాంకర్ లీ షిఫెంగ్ (చైనా)తో ఫైనల్లో భారత స్టార్ తలపడనున్నాడు.
పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ – చిరాగ్ ద్వయం.. స్టార్లంతా నిరాశపరిచిన చోట లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. సేన్, చౌ థియెన్ మధ్య సెమీఫైనల్ ఫైట్ నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌ను సేన్ 32-21తో గెలుపొంది చౌ థియెన్కు షాకిచ్చాడు.
What a defensive masterclass shown by Lakshya Sen upset hot favorite 3rd seed Chou Tien Chen 🇹🇼 at #HongKongOpen2025 MS SFs in straight game saving 3 GPs in 2nd set to claim his 1st ever BWF WT finals in 2025.👌Extraordinary result for LS. 👏 https://t.co/LRcYLBcj7u pic.twitter.com/g6WWXybhcl
— Amit Kumar De (@AmitK98infinite) September 13, 2025
అయితే.. రెండో సెట్ హోరాహోరీగా జరిగింది. మూడు పాయింట్లు (17-20) వెనకబడిన సేన్ అనూహ్యంగా పుంజుకొని ప్రత్యర్థికి షాకిచ్చాడు. వరుసగా పాయింట్లు సాధించి ఆరో సీడ్ ఆటకట్టించాడు. రెండేళ్ల తర్వాత అతడు ఆడుతున్న తొలి సూపర్ 500 ఫైనల్ ఇది. నాలుగో ర్యాంకర్ లీ షిఫెంగ్ (చైనా)తో ఫైనల్లో భారత స్టార్ తలపడనున్నాడు. 2023లో చివరిసారిగా కెనడా 500 ఓపెన్ ఫైనల్ ఆడిన సేన్.. ఇప్పుడు మళ్లీ టైటిల్ ఫైట్‌లో అమీతుమీకి సిద్ధమవుతున్నాడు.