పారిస్ : ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సోమవారం నుంచి మొదలైన ఈ టోర్నీలో లక్ష్యసేన్.. 17-21, 19-21తో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ షియుకీ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. ఈ టోర్నీ 2021 ఎడిషన్‌లో కాంస్యం గెలిచిన సేన్..
తొలి గేమ్‌ను కోల్పోయినా రెండో గేమ్‌లో పుంజుకుని ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చాడు. కానీ పటిష్టమైన డిఫెన్స్‌కు తోడు ఆఖర్లో పవర్ ఫుల్ ఎటాక్‌తో షి యు కీ విజృంభించడంతో సేన్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో చైనా షట్లర్ 4-1తో సేన్‌పై తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు.