హాంకాంగ్: గత కొద్దికాలంగా సెమీఫైనల్స్కే పరిమితమవుతున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్‌లో ఆ గండాన్ని అధిగమించారు. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఈ జోడీ ఫైనల్స్‌కు చేరింది.
శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో భారత జంట.. 21-17, 21-15తో వరుస సెట్లలో బింగ్-వీ లిన్-చెన్ చెంగ్ కౌన్ (చైనీస్ తైఫీ)ను ఓడించి ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఆరు సెమీస్ ఓటముల తర్వాత సాత్విక్ జోడీకి ఈ సీజన్లో ఇదే తొలి ఫైనల్స్. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ఫైనల్ చేరాడు. సెమీస్‌లో 23 ఏండ్ల ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. 23-21, 22-20తో ప్రపంచ 9వ ర్యాంకర్ టి.సి. చౌకు షాకిచ్చాడు.