Rajasthan Royals : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరోసారి చేతులు మారింది. పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందు జైపూర్‌కు చెందిన ఈ ఫ్రాంచైజీని కల్ సొమాని గ్రూప్ కొనుగోలు చేయగా.. ఇప్పుడు బ్రిటన్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు లక్ష్మి మిట్టల్ (Lakshmi Mittal) భారీ ధరకు దక్కించుకున్నాడు. 1.65 బిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీలో రూ.15,660 కోట్లు) రాజస్థాన్ జట్టును ఈ వ్యాపార దిగ్గజం సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ మధ్యలోనే రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త బాస్ చేతుల్లోకి వెళ్లింది. స్టీల్ వ్యాపారంలో దిగ్గజం లక్ష్మి మిట్టల్ కుటుంబం భారీ ధరకు రాజస్థాన్ యాజమాన్యం హక్కులు సాధించింది. ఫ్రాంచైజీలో 75 శాతం వాటా మిట్టల్ కుటుంబానిది కాగా.. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అడార్ పూనావాలా, మనోజ్ బడాలేలు సహ యజమానులుగా కొనసాగనున్నారు.
🏏 Here’s global steel baron Lakshmi N. Mittal on the $1.65 bn Rajasthan Royals buyout with Adar Poonawalla: Says his love for cricket and Rajasthan roots make RR the perfect fit, and he looks forward to backing the team’s future success. Post deal, the Mittal family will hold a… pic.twitter.com/ykPS5HMny1
— Moneycontrol (@moneycontrolcom) May 3, 2026
ఐపీఎల్ ఆరంభ సీజన్ జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేయడానికి కుటుంబ నేపథ్యమూ ఓ కారణమని లక్ష్మి మిట్టల్ తెలిపాడు. మాది రాజస్థాన్ కుటుంబం. అందుకే రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేశా. స్కూల్లో నేను క్రికెట్ ఆడాను. అప్పటి నుంచి నాకు క్రీడలంటే చాలా ఇష్టం. ఎందరో గొప్ప ఆటగాళ్లు రాజస్థాన్ జెర్సీని ధరించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన భారత దిగ్గజాలూ రాజస్థాన్‌కు ఆడారు. సో.. నేను ఈ గొప్ప జట్టులో భాగం కావాలనుకున్నా. స్టేడియంలో మ్యాచ్ చూస్తూ అభిమానులతో కలిసి రాజస్థాన్ విజయాన్ని కాంక్షించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా అని లక్ష్మి మిట్టల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
🚨 BREAKING
Lakshmi Mittal has announced the acquisition of Rajasthan Royals franchise.
Adar Poonawalla and Manoj Badale are part of the consortium that has acquired the franchise for $1.65 billion. pic.twitter.com/MiZ5piwzrP
— Cricbuzz (@cricbuzz) May 3, 2026
పంతొమ్మిదో సీజన్‌కు ముందే రాజస్థాన్ ఫ్రాంచైజీ వేలంలో భారీ ధర పలికింది. బ్రిటన్‌కు చెందిన కల్ సొమనీ నాయకత్వంలోని సంఘం.. రాబ్ వాల్టన్(వాల్‌మార్ట్), ది హంప్ (ఫోర్డ్) కుటుంబాలు రాజస్థాన్ జట్టును హస్తగతం చేసుకున్నాయి. అయితే.. సీజన్ మధ్యలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ లక్ష్మి మిట్టల్ కుటుంబం అత్యధిక వాటాను కొనుగోలు చేసింది. 75 శాతం వాటాలో మిట్టల్ ఫ్యామిలీ ఫ్రాంచైజీలో పెద్దన్నలా వ్యవహరించనుంది. అడార్ పునావాలా 18 శాతం, మిగిలిన ఏడు శాతం వాటా మనోజ్ బడలే పేరున ఉంది.