హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న 11వ తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో లైశా కిరణ్, సూర్యకృష్ణ పతక జోరు కనబరిచారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న టోర్నీలో మహిళల విభాగంలో లైశా కిరణ్ ఏడు పతకాలతో సత్తాచాటింది. ప్రత్యర్థి షూటర్లకు దీటైన సవాల్ విసురుతూ పతక ధమాకా కొనసాగించింది.
పురుషుల కేటగిరీలో సూర్యకృష్ణ రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలతో ఆకట్టుకున్నాడు. మరోవైపు సంగెం తాన్సి ఏడు పతకాలు, నాగసాయి తరుణ్ నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలు, ట్రాప్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో జయగురు సింహ రెండు పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో పతక విజేతలను స్పీకర్ ప్రసాద్, టీవోఏ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్సంఘి అభినందించారు.