T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8 పోటీలకు ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్(West Indies)కు భారీ షాక్. కీలకమైన దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో పాటు టోర్నీ మొత్తానికి ఓపెనర్ బ్రాండన్ కింగ్(Brandon King) దూరమయ్యాడు. కండరాల గాయంతో బాధపడుతున్న కింగ్ వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. దాంతో, అతడి స్థానంలో విధ్వంసక ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్(Kyle Mayers) జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని విండీస్ బోర్డు వెల్లడించింది.
తొలి సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై కింగ్ గాయపడ్డాడు. 23 పరుగుల వద్ద ఉండగా పక్కటెముకల సమీపంలోని కండరాల నొప్పితో కింద పడిపోయాడు. ఫిజియో వచ్చి పరీక్షించినా అతడు నొప్పికి తట్టుకోలేకపోయాడు. దాంతో, ఇన్నింగ్స్ మధ్యలోనే అతడు రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అమెరికా మ్యాచ్ వరకూ అతడు కోలుకుంటాడని మేనేజ్మెంట్ భావించింది. కానీ, కింగ్ ఆరోగ్యం ఇంకా మెరుగవ్వలేదు. అందుకని దక్షిణాఫ్రికాతో జూన్ 23ఆదివారం మ్యాచ్‌కు ముందు విండీస్ బోర్డు మేయర్స్‌ను ఎంపిక చేసింది.
🚨 West Indies opener has been ruled out of the #T20WorldCup 2024 due to injury as they confirm a replacement.
Details ⬇️https://t.co/ZXuXueKUsz
— ICC (@ICC) June 21, 2024
మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న విండీస్ టైటిల్ ఫేవరట్లలో ఒకటి. లోయర్ ఆర్డర్ వరకూ హిట్టర్లతో నిండిన కరీబియన్ టీమ్ అద్భుత ఆటతీరుతో సూపర్ 8కు చేరింది. అయితే.. రెండో దశలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ధాటికి పావెల్ సేన ఓటమిపాలైంది. ఆ బాధ నుంచి తేరుకున్న విండీస్ శనివారం అమెరికాపై సూపర్ విక్టరీ కొట్టింది. షాయ్ హోప్(82 నాటౌట్) మెరుపు అర్ధ సెంచరీ బాదడంతో 128 పరుగులను కేవలం 11 ఓవర్లలోనే ఛేదించి రన్‌రేట్ మెరుగుపర్చుకుంది.
West Indies get their first win of the Super Eight stage and boost their net run rate 🙌#T20WorldCup | #USAvWI | 📝 https://t.co/Uq20b7LgVQ pic.twitter.com/D4jcpuMnNY
— ICC (@ICC) June 22, 2024