Chinnaswamy Stadium : ఐపీఎల్ వేళ భారత దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), అనిల్ కుంబ్లే (Anil Kumble)కు ప్రత్యేక గౌరవం లభించింది. టీమిండియాకు, కర్నాటక క్రికెట్‌కు వీరిద్దరు అందించిన విశేష సేవలకు గుర్తుగా కర్నాటక క్రికెట్ సంఘం చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో స్టాండ్లు ఏర్పాటు చేసింది. ఆదివారం ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు ముందు ద్రవిడ్, కుంబ్లేలు రిమోట్‌తో తమ పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను ప్రారంభించి మురిసిపోయారు.
ఐపీఎల్ సందడితో పూర్వవైభవం సంతరించుకున్న చిన్నస్వామి స్టేడియంలో భారత మాజీ ఆటగాళ్ల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. కర్నాటక క్రికెట్‌పై.. ఆపై టీమిండియాపై చెరగని ముద్ర వేసిన రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు చేసింది రాష్ట్ర క్రికెట్ సంఘం.
A fitting tribute to two of India’s greatest cricketing legends, Anil Kumble and Rahul Dravid
The M Chinnaswamy Stadium has officially unveiled the Anil Kumble End & Rahul Dravid End, honouring their immense contributions to Karnataka and Indian cricket pic.twitter.com/qgPaIlAGpE
— Cricketopia (@CricketopiaCom) April 5, 2026
ఆదివారం ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌కు ముందు కేసీఎస్ చీఫ్ వెంకటేశ్ ప్రసాద్ తనతోపాటు కుంబ్లే, ద్రవిడ్‌ను మైదానంలోకి తీసుకెళ్లాడు. వారికి రిమోట్ అందించి.. వారి పేర్లతో ఏర్పాటు చేసిన పెవిలియన్ ఎండ్‌ను ప్రారంభింపజేశారు. అనంతరం వీరికి జ్ఞాపికలు ప్రదానం చేశారు. చిన్నస్వామిలోని పెవిలియన్ ఎండ్స్‌కు ఇద్దరు దిగ్గజాల పేర్లు పెట్టడంపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.