IND vs NZ :స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ చెలరేగిపోతున్న టీమిండియా.. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. అదిరే విజయంతో సిరీస్‌లో ముందంజ వేసిన భారత్ రెండో మ్యాచ్‌లోనూ పంజా విసరాలనుకుంటోంది. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20కి పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అందుబాటులో లేరు. వీరి స్థానంలో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా తుది జట్టులోకి వచ్చారని టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్య తెలిపాడు.
టాస్ గెలిచిన టీమిండియా సారథి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి మ్యాచ్‌లో కంగుతిన్న కివీస్.. విజయమే లక్ష్యంగా మూడు మార్పులతో ఆడుతోంది. ఓపెనర్ రాబిన్సన్, జేమీసన్, క్లార్కే స్థానంలో సీఫర్ట్, ఫౌల్కీస్, హెన్రీ జట్టులోకి వచ్చారు.
#TeamIndia‘s Playing XI for the 2️⃣nd T20I 🙌
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/8lSHilY59v
— BCCI (@BCCI) January 23, 2026
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ సీఫర్ట్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జకారీ ఫౌల్కీస్, ఇష్ సోధీ, జాకబ్ డఫ్ఫీ.