IND vs BAN : ఐసీసీ ట్రోఫీ వేటలో విజయాలతో దూసుకెళ్తున్న భారత్(Team India) సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సూపర్ 8 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh)ను టీమిండియా వణికించింది. భారీ ఛేదనలో కుల్దీప్ యాదవ్(3/19), జస్ప్రీత్ బుమ్రా(2/13)లు విజృంభించడంతో 50 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తొలు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్), విరాట్ కోహ్లీ(37) మెరుపులతో మెగా టోర్నీలో రికార్డు స్కోర్ చేసిన రోహిత్ సేన ఆ తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేసి.. గ్రూప్ 1 నుంచి దర్జాగా సెమీస్ బెర్తు కైవసం చేసుకుంది. అంటిగ్వాలో విజయంతో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయాల రికార్డు 13కు పెరిగింది.
వరల్డ్ కప్ లీగ్ దశలో ఓటమెరుగని టీమిండియా సూపర్ 8లోనూ రఫ్పాడిస్తోంది. తొలి పోరులో అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాకు అదిరే ఆరంభం లభించలేదు. ఓపెనర్ తంజిద్ హసన్(29)ధాటిగా ఆడినా హార్దిక్ పాండ్యా ఎంట్రీతో సీన్ మారింది. తన తొలి ఓవర్లోనే లిట్టన్ దాస్(10)ను ఔట్ చేసిన పాండ్యా టీమిండియాకు బ్రేకిచ్చాడు.
India crush Bangladesh to take a huge step into the semifinals 💪
🔗 https://t.co/TViqUcv5FD | #INDvBAN pic.twitter.com/9DTOsBVEkp
— ESPNcricinfo (@ESPNcricinfo) June 22, 2024
ఆ తర్వాత చైనామన్ కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టేశాడు. వరుస ఓవర్లలో తంజిద్, తౌహిద్ హృదోయ్(4)లను ఎల్బీగా ఔట్ చేసి తన మ్యాజిక్ చూపించాడు. ఇక ఒంటరి పోరాటం చేస్తున్న కెప్టెన్ నజ్ముల్ హుసెన్ శాంటో(40)ను ఔట్ చేసిన బుమ్రా బంగ్లాను మరింత కష్టాల్లోకి తోశాడు. ఆఖర్లో రిషద్ హొసెన్(24), మహ్మదుల్లా(13)లు బ్యాట్ ఝులిపించడంతో బంగ్లా 148కి పరిమితమై భారీ ఓటమిని తప్పించుకుంది.
1⃣ brings 2⃣ for Kuldeep Yadav! 👍 👍
Bangladesh 3⃣ down!
Follow The Match ▶️ https://t.co/QZIdeg3h22#T20WorldCup | #TeamIndia | #INDvBAN | @imkuldeep18
📸 ICC pic.twitter.com/v7Nn4ER4XI
— BCCI (@BCCI) June 22, 2024
అంటిగ్వాలో టాస్ ఓడిన రోహిత్ శర్మ జట్టుకు శుభారంభమిచ్చాడు. ధనాధన్ ఆడిన హిట్‌మ్యాన్ షకీబుల్ హసన్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ బాదిన హిట్‌మ్యాన్ అదే ఓవర్లో జకీర్ అలీ చేతికి చిక్కాడు. దాంతో, 39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(37), రిషభ్ పంత్(36)లు రన్ రేట్ 6కు తగ్గకుండా చూశారు. ముస్తాఫిజర్ వేసిన ఆరో ఓవర్లో కోహ్లీ కళ్లు చెదిరే సిక్సర్ బాదగా.. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 53 రన్స్ కొట్టింది. కోహ్లీ, పంత్‌ల దూకుడుతో దూసుకెళ్తున్న భారత స్కోర్ బోర్డకు తంజిమ్ హసన్ కళ్లెం వేశాడు.

ఒకే ఓవర్లో కోహ్లీని బౌల్డ్ చేసిన హసన్.. మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్(6)ను వెనక్కి పంపాడు. అయినా సరే పంత్ జోరు తగ్గించలేదు. ఒంటిచేత్తో సిక్సర్ బాది స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే. 11.4 ఓవర్లో పంత్ ఔటయ్యాక స్కోర్ వేగం తగ్గింది. శివం దూబే(34), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐదో వికెట్‌కు 53 రన్స్ జోడించి జట్టు స్కోర్ 160 దాటించారు. అఖర్లో పాండ్యా సిక్సర్లతో మోతమోగించాడు. ముస్తాఫిజుర్ వేసిన 20వ ఓవర్లో 3 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో, టీమిండియా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Innings Break!
A solid batting display from #TeamIndia! 💪
A cracking unbeaten half-century for @hardikpandya7 👌 👌
Some handy contributions from @imVkohli, @RishabhPant17, @IamShivamDube & captain @ImRo45
Over to our bowlers now! 👍
Scorecard ▶️ https://t.co/QZIdeg3h22… pic.twitter.com/e0dwlNEYcb
— BCCI (@BCCI) June 22, 2024