KTR | హైదరాబాద్: వెస్టిండీస్ నయా సంచలనం షామర్ జోసెఫ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. 27 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ తొలి విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన జోసెఫ్‌ను ఎక్స్(ట్విటర్)లో ఆయన అభినందించారు.
‘షామర్ జోసెఫ్ ఎంత అద్భుతమైన కథ నీది! ఈ నయా సంచలనం కోసం క్రికెట్ ప్రపంచం, బ్యాటర్లందరూ సిద్ధమై ఉండండి. గబ్బాలో ఆసీస్‌ను ఓడించిన విండీస్ మ్యాచ్ హైలెట్స్ చూశాను. ఫాస్ట్‌బౌలర్లు ఈ ప్రదర్శన చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు’ అని ట్వీట్ చేశారు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శనతో జోసెఫ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. సామాన్య సెక్యూరిటీ గార్డ్ నుంచి జోసెఫ్ ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.
#ShamarJoseph what a brilliant story! The cricketing world and all the batsmen, better be prepared for this sensational guy 👏👏
Watched the highlights of West Indies beating Australia at Gabba after 27 years!
Fast bowlers, when they are on a song are a real delight to watch pic.twitter.com/5lKqlzTPI8
— KTR (@KTRBRS) January 30, 2024