హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఆటతీరుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన ధనాధన్ ఆటతీరుతో చెన్నైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో ధోనీ వరుసగా 6, 4, 2, 4తో అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వయసు పెరిగినా..వన్నె తగ్గలేదని నిరూపిస్తూ చెన్నైని గెలిపించాడు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ ‘నిజానికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ధోనీ ఓ చాంపియన్ క్రికెటర్, అసాధారణ ఫినిషర్..రోజురోజుకి ఈ దిగ్గజం మరింత ఎదుగుతున్నారు’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.