హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేఎస్‌జీ వర్సిటీ బాస్కెట్‌బాల్ లీగ్ బాలికల విభాగంలో ఫ్యూచర్ కిడ్స్, బాలుర విభాగంలో ఓక్రిడ్జ్ జట్లు టైటిళ్లు సాధించాయి. సోమవారం మాదాపూర్‌లోని డీబీఏ బాస్కెట్‌బాల్ ప్రాంగణంలో జరిగిన బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్.. 46-28తో డీపీఎస్ హైదరాబాద్‌పై నెగ్గింది. బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ గచ్చిబౌలి జట్టు.. 80-65తో చిరెక్ కొండాపూర్‌పై గెలిచింది.
ఈ సందర్భంగా కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ ప్రమోటర్ అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి కేఎస్‌జీ వర్సిటీ బాస్కెట్ బాల్ లీగ్ ఒక మంచి వేదిక అని తెలిపారు.