IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో చిన్నస్వామి తొక్కిసలాట(Stampede) మృతులకు నివాళులు అర్పించారు. టాస్ అనంతరం ఆర్సీబీ(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లతో పాటు స్టాండ్స్‌లోని అభిమానులందరూ లేచి నిల్చొని మౌనం పాటించారు. ఇదివరకూ చెప్పినట్టుగానే ఆ పదకొండు మంది జ్ఞాపకార్థం కర్నాటక క్రికెట్ సంఘం ప్రత్యేకంగా 11 సీట్లను కేటాయించింది. జాతీయ గీతం ఆలాపన అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ , కర్నాటక క్రికెట్ సంఘం మాట నిలబెట్టుకున్నాయి. నిరుడు జూన్ 4వ తేదీన మరణించిన 11 మంది జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియంలో స్మారకం ఏర్పాటు చేయడంతో పాటు పదకొండు ప్రత్యేక సీట్లను కేటాయించాయి. ఇదివరకే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన ఆర్సీబీ.. ఇప్పుడు వారిని ప్రత్యేకంగా స్మరించుకుంది.
11 seats reserved for those 11 souls who lost their Life last year . ❤️ pic.twitter.com/R8BN41nBAU
— Jeet (@JeetN25) March 28, 2026
A moment of silence to honour the 11 Royal Challengers Bengaluru fans who tragically lost their lives on June 4 last year.
As a mark of respect, players from both teams are wearing black armbands tonight. Our thoughts remain with their families and loved ones 🙏#TATAIPL… pic.twitter.com/a8OsHOYUH7
— IndianPremierLeague (@IPL) March 28, 2026
ఆరంభ పోరుకు ముందు బీసీసీఐ ఛైర్మన్ మిథున్ మన్హస్, కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, ఆర్సీబీ – సన్‌రైజర్స్ ఆటగాళ్లు, ప్రేక్షకులు తొక్కిసలాట మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలాపనతో ఐపీఎల్ ఆట షురూ అవ్వగా, పది నెలల అనంతరం చిన్నస్వామిలో తొలి బంతి పడింది.
350+ CCTVs Setup at Chinnaswamy Stadium, Bangalore 📍 pic.twitter.com/Lvv5an1wOY
— Baljeet Singh (@ImTheBaljeet) March 28, 2026
గత సీజన్ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో కమిషన్ సూచన మేరకు స్టేడియంలో నిర్మాణ పరమైన మార్పులు చేవారు. అభిమానుల భద్రతకు భరోసాగా మైదానంలో 350కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.