అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకర్ భరత్ గుడ్‌బై
భారత వికెట్ కీపర్ బ్యాటర్, ఏపీ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ 32 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించాడు.
- 32 ఏండ్లకే రిటైర్మెంట్ ఇచ్చిన ఏపీ కికెటర్
న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ బ్యాటర్, ఏపీ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ 32 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించాడు. రిషబ్ పంత్ అందుబాటులో లేని సమయంలో కేఎస్ భరత్ టెస్టు జట్టులోకి వచ్చాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఏడు టెస్టులు మ్యాచ్‌లు ఆడిన భరత్.. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
కేవలం 221 పరుగులు మాత్రమే సాధించాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టు తరఫున సుదీర్ఘ కాలం పాటు స్థిరమైన ప్రదర్శన ఇచ్చిన భరత్.. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 రన్స్ చేశాడు. ఐపీఎల్లో పది మ్యాచ్‌లు ఆడాడు. దేశం తరఫున ఆడటం తన జీవితంలో దక్కిన అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్న భరత్ ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ సంఘం, తన కెప్టెన్లు కోహ్లీ, రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

