IPL 2025 : పవర్ ప్లేలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోలుకుంది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(53) ఢిల్లీ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. క్రీజులో కుదురుకున్న కృనాల్.. బౌండరీతో అర్ధ శతకం సాధించాడు. ఈ ఎడిషన్‌లో అతడికి ఇదే తొలి ఫిఫ్టీ. 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో యాభైకి చేరువయ్యాడీ స్పిన్ ఆల్‌రౌండర్.
ముకేశ్, కుల్దీప్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ హాఫ్ సెంచరీతో జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ(41) యాంకరింగ్ రోల్ పోషిస్తున్నాడు. చివరిదాకా నిలబడాలనే ఉద్దేశంతో విరాట్ రిస్క్ తీసుకోవడం లేదు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 114-3. ఇంకా డిల్లీ విజయానికి 49 రన్స్ కావాలంతే.
When it mattered the most 🤌
Maiden FIFTY of the season for Krunal Pandya 😎
He continues to add value to the #RCB chase 🏃
Updates ▶ https://t.co/9M3N5Ws7Hm#TATAIPL | #DCvRCB | @krunalpandya24 pic.twitter.com/9D9McH0wxs
— IndianPremierLeague (@IPL) April 27, 2025
ఢిల్లీ గడ్డపై రివెంజ్ మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ విజృంభణకు తోడు కరుణ్ నాయర్ ఖతర్నాక్ ఫీల్డింగ్ కారణంగా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ ఒకే ఓవర్లో ఓపెనర్ జాకబ్ బెథెమ్(12), ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. ఆ కాసేపటికే కెప్టెన్ రజత్ పాటిదార్(6) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దాంతో, 26 పరుగులకే బెంగళూరు జట్టు 3 ప్రధాన వికెట్లు పడ్డాయి.