టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రయ్యాడు. పాండ్యా, పంఖూరీ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఈ జంట తమ తమ ఇన్స్టాగ్రాం ఖాతాల్లో వెల్లడించారు. బిడ్డతో కలిసి దిగిన ఫొటోలను వీళ్లిద్దరూ పంచుకున్నారు. బిడ్డకు ‘కవీర్ కృనాల్ పాండ్యా’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. దీనిపై కృనాల్ సోదరుడు మరో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. హార్ట్ ఎమోజీస్‌తో రిప్లై ఇచ్చాడు.
హార్దిక్ ఒక్కడే కాదు కేఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు కృనాల్‌కు శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెట్టారు. గతేడాది వరకు ఐపీఎల్లో రోహిత్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఆడిన కృనాల్.. తాజా ఐపీఎల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.