Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాజా సోషల్ మీడియా బజ్ ప్రకారం ‘రాకా’ చిత్రాన్ని 2027 డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే తేదీ ఖరారైతే, కొత్త సంవత్సరం సందర్భంగా భారీ బాక్సాఫీస్ పోరుకు ‘రాకా’ సిద్ధమైనట్లే.
అయితే ఈ రిలీజ్ డేట్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే సినిమా 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు డిసెంబర్ 31 తేదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ తదితరులు కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది.అంతేకాకుండా యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
‘రాకా’ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్న మరో అంశం ఏమిటంటే.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం. అయితే దీనిపై కూడా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అట్లీ గత చిత్రాల్లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్, కమర్షియల్ హంగులను భారీ స్థాయిలో చూపించారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఆయన చేస్తున్న ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ డిసెంబర్ 31, 2027 రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైతే, ‘రాకా’ కొత్త సంవత్సరం వేడుకలకు ముందే థియేటర్లలో భారీ సందడి చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.