Nani | ‘ఏషనాగుల’ సాంగ్ రికార్డుల వేట.. 5 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్!
Nani | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో.. మరోసారి ఈ కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి.
Nani | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో.. మరోసారి ఈ కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ఇక సినిమా విడుదలకు ముందే ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన ఓ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే ‘ఏషనాగుల’. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, మీమ్స్‌లోనూ తెగ ట్రెండ్ అవుతోంది.
‘ఏషనాగుల’ పాట విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి చిత్ర బృందం కూడా ఫుల్ జోష్‌లో ఉంది. ముఖ్యంగా ఈ పాట యూట్యూబ్‌లో అత్యంత వేగంగా వ్యూస్ సొంతం చేసుకుంటూ కొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే 50 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కేవలం ఐదు రోజుల్లో 50 మిలియన్ మార్క్‌ను అందుకున్న తొలి తెలుగు పాటగా ఇది రికార్డు సృష్టించిందని మేకర్స్ పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ కనిపిస్తున్నాయి.
రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదిరిపోయే మాస్ బీట్స్, క్యాచీ రిథమ్‌తో పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి తోడు స్క్రీన్‌పై నాని, కీర్తి సురేశ్‌ల ఊరమాస్ డ్యాన్స్ మూమెంట్స్ పాటకు మరింత హైప్ తీసుకొచ్చాయి. పాటను ఒక్కసారి విన్నవాళ్లు మళ్లీ మళ్లీ వినేలా అనిరుధ్ మ్యూజిక్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఏషనాగుల’ పాటకు వచ్చిన రెస్పాన్స్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aay sher
- look
- Nani
- THE PARADISE
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

