పోరాడి ఓడిన పవ్ల్యూచెంకోవా
అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అంచెలంచెలుగా ఎదుగుతూ దూసుకొచ్చిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బొరా క్రెజికోవా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ముద్దాడింది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో క్రెజికోవా 6-1, 2-6, 6-4తో 31వ సీడ్ అనస్తాసియా పవ్ల్యూచెంకోవాపై గెలిచింది. గత ఐదేండ్లలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా క్రెజికోవా నిలిచింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణుల మధ్య రసవత్తర పోరు సాగగా.. ప్రత్యర్థి కంటే ఎక్కువ విన్నర్లు కొట్టిన క్రెజికోవాను విజయం వరించింది.
40 ఏండ్లలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మొదటి చెక్ రిపబ్లిక్ ప్లేయర్‌గా క్రెజికోవా రికార్డు సృష్టించింది. చివరిసారి 1981లో హన మంద్లికోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.
ప్రైజ్‌మనీ విజేత-క్రెజికోవా రూ.12.41 కోట్లు