కీసర, అక్టోబర్ 11: కీసర మండల కేంద్రానికి చెందిన నల్ల క్రాంతిరెడ్డి..జాతీయ టీ20 టోర్నీకి ఎంపికైంది. గత కొన్ని టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న క్రాంతి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. నల్ల రామకృష్ణారెడ్డి, రాణి కుమార్తె అయిన క్రాంతి ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. స్కూల్ స్థాయి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న క్రాంతి అంచలంచెలుగా ఎదిగింది. వనస్థలిపురంలోని శివాజీ క్రికెట్ అకాడమీలో 2015 నుంచి శిక్షణ తీసుకుంటున్న ఈ యువ ప్లేయర్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నది. బ్యాటింగ్‌తో పాటు ఉపయుక్తమైన బౌలింగ్‌తో హైదరాబాద్ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నది. బెంగళూరు వేదికగా జరుగనున్న బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 క్రికెట్ టోర్నీకి ఎంపికైంది. హైదరాబాద్ జట్టుకు ఈ యువ ఆల్‌రౌండర్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. క్రికెట్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.