INDW vs PAKW : పవర్ ప్లేలో నిప్పులు చెరిగిన భారత పేసర్ క్రాంతి గౌడ్ మూడో వికెట్ తీసింది. అలియా రియాజ్(2)ను ఔట్ చేసిన ఈ స్పీడ్‌స్టర్.. కీలక భాగస్వామ్యం నెలకొల్పిన నటాలియా పర్వేజ్(33)ను ఔట్ చేసింది. రాధా యాదవ్ చక్కని క్యాచ్ అందుకోవడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. అర్ధ శతకానికి చేరువైన సిద్రా అమిన్(48) జట్టును గెలిపించేందుకు పోరాడుతోంది. అమెకు అండగా కెప్టెన్ ఫాతిమా సనా ఉంది. దాంతో, పాక్ 30 ఓవర్లలో 101 రన్స్ చేసింది. ఇంకా విజయానికి 146 రన్స్ అవసరంకాగా.. టీమిండియాకు ఆరు వికెట్లు కావాలి.
ఛేదనలో ఆరు పరుగులకే ఓపెనర్ మునీబా అలీ(2) రనౌట్ కాగా.. ఆకాసేపటికే సడాఫ్ షమాస్ (6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం.. రేణుకా సింగ్ ఓవర్లో సిద్రా అమిన్ (48 నాటౌట్) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రీచా వదిలేసింది. డైవ్ చేయడంతో బంతి ఆమె మణికట్టుకు తగిలి కింద పడింది. లేదంటే పాక్ మూడో వికెట్ పడేది. పది ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన పాక్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది.
Excellent bowling change from #TeamIndia 👌
Kranti Gaud makes an impact straight away ☝️
What an impressive show from her ✨
Updates ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue | #CWC25 pic.twitter.com/NqwOOkelWS
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
అలియా రియాజ్ (2) త్వరగానే ఔటయ్యాక.. నటాలియా పర్వేజ్(33), సిద్రా అమిన్(48)లు క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లను విసిగిస్తూ నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీకిపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే… 69 రన్స్ జోడించిన పర్వేజ్‌ను క్రాంతిగౌడ్ వెనక్కి పంపి పాక్‌ను కష్టాల్లోకి నెట్టింది. రాధా యాదవ్ చక్కగా క్యాచ్ అందుకోవడంతో పాక్ నాలుగో వికెట్ పడింది.