జకార్తా: హాకీ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 స్టేజ్ చివరి మ్యాచ్‌ను టీమ్ఇండియా 4-4తో ‘డ్రా’ చేసుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో మలేషియా 5-0తో జపాన్‌పై విజయం సాధించడంతో.. ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితిలో భారత్ బరిలోకి దిగగా.. ఫలితం నిరాశ పరిచింది.
చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత్ తరఫున నీలమ్ సంజీప్ (9వ నిమిషంలో), దిప్సన్ టిర్కీ (21వ ని.లో), మహేశ్ గౌడ (22వ ని.లో), శక్తివేల్ (37వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున జాంగ్ జాంగ్యూన్ (13వ ని.లో), జీ వూ చెన్ (18వ ని.లో), కిమ్ జాంగ్ హో (28వ ని.లో), జాంగ్ మాంజే (44వ ని.లో) గోల్స్ సాధించారు. బుధవారం జరుగనున్న ఫైనల్లో మలేషియాతో కొరియా తలపడనుండగా.. మూడో స్థానం కోసం జరుగనున్న పోరులో జపాన్‌తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.Korea