IPL 2025 : సొంత మైదానంలో భారీ ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బ్యాటర్లు పోరాడుతున్నారు. ఓపెనర్ క్వింటన్ డికాక్(15) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. రెండు సిక్సర్లతో జోరు మీదున్న డికాక్‌ను ఆకాశ్ దీప్ ఎల్బీబా వెనక్కి పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానేతో కలిసి సునీల్ నరైన్(30) బౌండరీలతో చెలరేగాడు. రెండో వికెట్‌కు 60 రన్స్ జోడించాడు.
ప్రమాదకరంగా మారిన ఈ డాషింగ్ ఓపెనర్‌ను మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ పెవిలియన్ చేర్చాడు. తన అభిమాన క్రికెటర్‌ను ఔట్ చేశాక నోట్‌బుక్ సెలబ్రేషన్ బదులు.. మైదానంలో గడ్డిమీద పేరు రాస్తూ సంబురాలు చేసుకున్నాడీ లక్నో స్పిన్ సంచలనం. ప్రస్తుతం వెంకటేశ్ అయ్యర్(26), కెప్టెన్ అజింక్యా రహానే(47)లు ధాటిగా ఆడుతున్నారు. దాంతో, 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది ఆతిథ్య జట్టు. ఇంకా విజయానికి 110 పరుగులు కావాలి.