Abhishek Nair : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హెడ్‌కోచ్ వేటలో ఉన్న ఆ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్ (Abhishek Nair)కు ఆ పదవిని కట్టబెట్టింది. ఈ విషయాన్ని గురువారం ఎక్స్ వేదికగా కోల్‌కతా వెల్లడించింది. ఈమధ్యే రాజీనామా చేసిన చంద్రకాంత్ పండిట్ (Chandrakant Pandit) స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. ఫ్రాంచైజీతో సుదీర్ఘ అనుబంధమున్న అభిషేక్ నాయర్ హెడ్‌కోచ్‌గా నియమితులవ్వడంతో కోల్‌కతా ప్లేయర్లు మస్త్ ఖుషీ అవుతున్నారు.
లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ అయిన అభిషేక్ 2009లో టీమిండియా తరఫున తొలి వన్డే ఆడాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులో పాతుకుపోతాడు అనుకుంటే అదే ఏడాది సెప్టెంబర్‌తో అతడు బ్లూ జెర్సీకి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన అభిషేక్ 2018లో కోల్‌కతా క్యాంప్‌లో చేరాడు. అప్పటి నుంచి ఫ్రాంచైజీ కొన్న కుర్రాళ్లలో మెలకువలు పెంపొందించడమే పనిగా శ్రమించాడు. అభిషేక్ శిక్షణలోనే చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లు మరింత రాటుదేలారు. ఆరేండ్ల అతడి కష్టానికి 2024లో కోల్‌కతా ట్రోఫీ గెలవడంతో ఫలితం దక్కినట్టైంది.
What started in 2018 comes full circle today! 🥺🙌 pic.twitter.com/PmnyDFqTGX
— KolkataKnightRiders (@KKRiders) October 30, 2025
అయితే.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టాక.. సహాయక కోచ్‌గా నాయర్‌కు అవకాశం లభించింది. కానీ, శ్రీలంకపై వన్డే సిరీస్, ఆపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కారణంగా అసిస్టెంట్ కోచ్‌లపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సో.. నాయర్ వైదొలగాల్సి వచ్చింది. దాంతో.. అతడిని సహాయక కోచ్‌గా తీసుకుంది కోల్‌కతా. 19వ సీజన్లో అజింక్యా రహానే సారథ్యంలోని కోల్‌కతా తీవ్రంగా నిరాశపరిచింది. యాజమాన్యం నుంచి తీవ్ర విమర్శలు రావడంతో హెడ్‌కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ స్వచ్ఛందంగా వైదొలిగాడు.