IPL 2023 : విరాట్ కోహ్లీ(50) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అర్ష్దీప్ సింగ్ ఓవర్లో బౌండరీ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అర్థ శతకం బాదిన కెప్టెన్ డూప్లెసిస్(64) క్రీజులో ఉన్నాడు. వీళ్లు 85 బంతుల్లోనే 119రన్స్ జోడించారు. దాంతో ఆర్సీబీ 14 ఓవర్లకు 118 పరుగులు చేసింది. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతుండడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.
HUNDRED Partnership & going strong 💥
Who will break this stand for #PBKS ❓
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/F0auvm1MlS
— IndianPremierLeague (@IPL) April 20, 2023
సూపర్ ఫామ్లో ఉన్న కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 600 ఫోర్లు బాదిన రెండోడోక్రికెటర్గా గుర్తింపు సాధించాడు. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. గబ్బర్ ఇప్పటి వరకు 734 బౌండరీలు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 592 ఫోర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Another day, another milestone 😉
6⃣0⃣0⃣ fours now in #TATAIPL for @imVkohli 🫡
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/HzFwFdGmeA
— IndianPremierLeague (@IPL) April 20, 2023