Kohli – Shakib | కోహ్లీ మరో మైలురాయి.. 50 వికెట్లతో షకీబ్ రికార్డు
Kohli - Shakib : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారీ స్కోర్ కొట్టకపోయినా ప్రపంచ క్రికెట్లో పరుగుల వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. మరోవైపు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ 50 వికెట్లతో చరిత్ర సృష్టించాడు.
Kohli – Shakib : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారీ స్కోర్ కొట్టకపోయినా ప్రపంచ క్రికెట్లో పరుగుల వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లలో 3 వేల రన్స్ కొట్టిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు.
అంటిగ్వా వేదికగా సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 37 రన్స్ చేసిన విరాట్ ఈ మైలురాయికి చేరుకున్నాడు. ఇప్పటివరకూ పొట్టి వరల్డ్ కప్‌లో కోహ్లీ 32 మ్యాచ్‌లు ఆడి 1,207 రన్స్ బాదాడు. మొత్తంగా రెండింటిలో కలిపి 69 మ్యాచుల్లో 3,002 పరుగులు సాధించాడు.

రోహిత్ శర్మ వికెట్‌తో..
మరోవైపు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) 50 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా షకీబ్ రికార్డు నెలకొల్పాడు. సూపర్ 8 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఔట్ చేసి అతడు 50 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 40 ఇన్నింగ్స్‌ల్లో 19.50 సగటుతో షకీబ్ వికెట్ల హాఫ్ సెంచరీ కొట్టాడు.
అంతేకాదు ఏకంగా మూడుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇదే కాకుండా అత్యధిక వరల్డ్ కప్‌లు ఆడిన ఆటగాడిగానూ షకీబ్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ప్రపంచంలోనే మేటి ఆల్రౌండర్లలో ఒకడైన అతడికి ఇది తొమ్మిదో( వన్డే, టీ20 వరల్డ్ కప్ కలిపి) ప్రపంచ కప్ కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

