ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎడాపెడా బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్.. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ బాదేందుకే చూశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కువగా స్ట్రైకింగ్ అవకాశం కూడా ఇవ్వలేదు.
ఐదు ఓవర్లు ముగిసే సరికి రోహిత్ కేవలం 5 బంతులే ఆడాడంటేనే.. రాహుల్ ఎంతలా స్ట్రైకింగ్‌ను తన వద్దే ఉంచుకున్నాడో అర్థమవుతుంది. పవర్‌ప్లే చివరి ఓవర్లో రాహుల్ (50 నాటౌట్) అర్ధశతకంప పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో రోహిత్ శర్మ (13 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో భారత జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 69 పరుగులతో నిలిచింది.
Boom six by KL Rahul
Credit @FoxCricket#INDvAUS#T20WorldCup pic.twitter.com/0plXnKC2wN
— Honey Ansari (@pakcrichd) October 17, 2022