KL Rahul | మెల్బోర్న్: ఫామ్‌లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఇక అనుమానంగానే కనిపిస్తున్నది! ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో అతడు వరుస ఇన్నింగ్స్‌లలో అట్టర్ ప్లాఫ్ అయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులే చేసిన రాహుల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 44 బంతులాడి 10 పరుగులే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ మరోసారి కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 31 ఓవర్లలో 73 పరుగులే చేసి ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో ధ్రువ్ జురెల్ (19 నాటౌట్), నితీశ్ రెడ్డి (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కస్ హరిస్ (74) అర్ధ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ (4/50), ముకేశ్ కుమార్ (3/41) రాణించారు.