ఢిల్లీ: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున ఆడటమే తన లక్ష్యమని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా 2022లో ముగిసిన టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడాక మెన్ ఇన్ బ్లూకు మళ్లీ పొట్టి ఫార్మాట్లో ఆడని రాహుల్.. జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
ఇదే విషయమై అతడు ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అవును. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ నా మైండ్‌లో ఉంది. నేను మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా. కానీ ఇప్పటికైతే నేను నా ఆటను ఆస్వాదిస్తున్నా’ అని తెలిపాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన రాహుల్.. 13 మ్యాచ్‌లలో 149 సగటుతో 539 పరుగులు చేశాడు. గత ఆరు సీజన్లలో రాహుల్.. ఐదుసార్లు 500 పరుగుల మార్కును దాటాడు.