KKR Vs RR | ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా ఆదివారం రెండు మ్యాచులు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ రెండు మార్పులు చేసింది. మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ తిరిగి జట్టులోకి తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఆర్ఆర్ ఈ మ్యాచ్‌లో మూడు మార్పులు చేసింది. కుమార్ కార్తికేయ స్థానంలో హసరంగ, కునాల్ రాథోడ్, యుధ్వీర్ జట్టులోకి తీసుకుంది.
హోంగ్రౌండ్లో గతంలో అద్భుతంగా రాణించిన కోల్‌కతా.. ఈ సారి సీజన్లో ఈడెన్‌గార్డెన్స్‌లో తడబడుతున్నది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్ పూర్తిస్థాయిలో సాగలేదు. రెండు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభించింది. కేకేఆర్ స్పిన్నర్లు ఇక్కడ బౌన్స్‌ను చేసుకోవడంలో విఫలమవుతున్నారు. బ్యాట్స్‌మెన్ సైతం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బ్యాటింగ్‌లో దూకుడు కనిపించడం లేదు. గతంలో జట్టు టైటిల్‌ను నెగ్గింది. ఈ సారి మాత్రం తడబడుతూ వస్తున్నది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఏడోస్థానంలో ఉన్నది. పది మ్యాచుల్లో నాలుగు గెలువగా.. వర్షం కారణంగా ఒకటి ఫలితం తేలలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. 11 మ్యాచుల్లో మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఆరు పాయింట్లతోఎనిమిదో స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(వికెట్ కీపర్), రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా.
రాజస్థాన్ రాయల్స్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, క్వేనా మఫాకా, అశోక్ శర్మ.
కోల్‌కతా సబ్స్: మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకూల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.