KKR vs SRH | సిక్సర్‌తో ముగించిన రస్సెల్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే?
సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ (49 నాటౌట్) సిక్సర్‌తో ముగించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాను టాపార్డర్ నిరాశ పరిచింది. గత మ్యాచ్‌లో అదగొట్టిన వెంకటేశ్ అయ్యర్ (7) నిరాశ పరచగా.. కాసేపు మెరుపులు మెరిపించిన రహానే (28), నితీష్ రాణా (26) భారీ స్కోర్లు చెయ్యలేకపోయారు.
కెరీర్లో 100వ ఐపీఎల్ మ్యాక్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ (15) మరోసారి విఫలమవగా.. యువ ఆటగాడు రింకూ సింగ్ (5) కూడా ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో శామ్ బిల్లింగ్స్ (34), రస్సెల్ జట్టును ఆదుకున్నారు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై వీళ్లిద్దరూ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా జట్టు మంచి స్కోరు చేసింది. వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో రస్సెల్ 20 పరుగులు పిండుకున్నాడు.
దీంతో కోల్‌కతా జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్ తలో వికెట్ తీసుకోగా.. ఉమ్రాన్ ఒక్కడే మూడు వికెట్లతో సత్తా చాటాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మరి సన్‌రైజర్స్ ఎంత వరకు పోరాడుతుందో చూడాలి.
.@umran_malik_1 scalped 3⃣ wickets and was our top performer from the first innings of the #KKRvSRH clash. 👌 👌 #TATAIPL | @SunRisers
Here's a summary of his bowling display 🔽 pic.twitter.com/8cpWJqJZD7
— IndianPremierLeague (@IPL) May 14, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

