సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆరంభంలోనే ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాత ధాటిగా ఆడింది. ముఖ్యంగా నితీష్ రాణా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతనికి రహానే నుంచి మంచి సహకారం లభించింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి కేకేఆర్ జట్టు ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వెంకటేశ్ బౌల్డ్ అయిన సంగతి తెలిసిందే.