KKR vs SRH | సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. ఆండ్రీ రస్సెల్ (49 నాటౌట్), శామ్ బిల్లింగ్స్ (34), రహానే (28), నితీష్ రాణా (26) రాణించడంతో 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) మరోసారి పేలవ ప్రదర్శన చేయగా.. ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠీ (9) కూడా విఫలయ్యాడు. సౌథీ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించిన అభిషేక్ శర్మ (43), ఎయిడెన్ మార్క్రమ్ (32) కాసేపు పోరాడారు. వాళ్లు అవుటైన తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (2), వాషింగ్టన్ సుందర్ (4), శశాంక్ సింగ్ (11), మార్కో జాన్సెన్ (1) విఫలమయ్యారు.
చివర్లో భువనేశ్వర్ కుమార్ (6 నాటౌట్), ఉమ్రాన్ మాలిక్ (3 నాటౌట్) జట్టు ఆలౌట్ కాకుండా కాపాడారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా జట్టు 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ ఓటమితో సన్‌రైజర్స్ దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే. అదే సమయంలో కోల్‌కతాకు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, సౌథీ రెండు వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

