KKR vs RR | ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 171 పరుగులు చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు శుభారంభం చేశారు. శుభ్‌మన్ గిల్ (56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వెంకటేశ్ అయ్యర్ (38) ఆకట్టుకున్నాడు. నితీశ్ రాణా 12 పరుగులకే క్యాచ్ ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి ( 12), దినేశ్ కార్తీక్ (14*), మోర్గాన్ (13*) మెప్పించలేకపోయారు.