అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పరాజయాలు చవిచూస్తూ తేలిపోయిన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిలకడ లేకుండా ఆడుతున్న ఆ జట్టు ఎలాగైనా విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం తాజాగా ముంబై చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ టార్గెట్‌గా ఎంచుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ సారధి శ్రేయాస్ అయ్యర్.. తొలుత బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే జట్టులో ఫామ్‌లేమితో భారంగా మారిన వెంకటేశ్ అయ్యర్‌తోపాటు హర్షిత్ రాణా కూడా ఆడటం లేదని తెలుస్తోంది. వెంకటేశ్ స్థానంలో అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా స్థానంలో శివమ్ మావి ఆడుతున్నారని శ్రేయాస్ తెలిపాడు. అలాగే రాజస్థాన్ జట్టులో ప్రభావం చూపని కివీస్ ఆల్‌రౌడర్ డారియల్ మిచెల్ స్థానంలో కరుణ్ నాయర్ ఆడుతున్నట్లు సంజూ శాంసన్ వెల్లడించాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, అనుకూల్ రాయ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), బాబా ఇంద్రజిత్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, శివమ్ మావి
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
A look at the Playing XI for #KKRvRR
Live – https://t.co/fVVHGJTNYn #KKRvRR #TATAIPL https://t.co/W2xIri92oJ pic.twitter.com/tXxxjfoOBR
— IndianPremierLeague (@IPL) May 2, 2022