పంజాబ్ స్పిన్నర్ దీపక్ చాహర్ సత్తా చాటాడు. వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఏడో ఓవర్లో బంతి అందుకున్న అతను నాలుగో బంతికి కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (26)ను అవుట్ చేశాడు. చాహర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు శ్రేయాస్ ట్రై చేశాడు. కానీ టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని రబాడ సులభంగా అందుకున్నాడు. దీంతో కోల్‌కతా కెప్టెన్ కథ ముగిసింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా (0) తను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. చాహర్ వేసిన డెలివరీని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది నేరుగా రాణా ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుట్ ఇవ్వడంతో రాణా రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా రాణా అవుటని తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఏడో ఓవర్లో చాహర్ రెండు వికెట్లు తీయడంతోపాటు.. ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించాడు.