కోల్‌కతా నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (5), శామ్ బిల్లింగ్స్ (4) ఇద్దరూ విఫలమవడంతో.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (2), శ్రేయాస్ అయ్యర్‌లపై భారం పడింది. ఈ ఒత్తిడిని తట్టుకొని ఆడేందుకు ఇద్దరూ ప్రయత్నించారు కానీ.. ఇద్దరూ తడబడుతూనే ఆడారు. ఈ క్రమంలో ఫెర్గూసన్ బౌలింగ్‌లో రాణా అవుటవగా.. పవర్ ప్లే ముగిసిన తర్వాతి బంతికే శ్రేయాస్ కూడా పెవిలియన్ చేరాడు.
యష్ దయాళ్ వేసిన బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి 34 పరుగులు చేసిన ఆ జట్టు.. అదే స్కోరు వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్ ఉన్నారు. వీళ్లతోపాటు ఆండ్రీ రస్సెల్ కూడా బ్యాటు ఝుళిపించకపోతే కేకేఆర్ ఖాతాలో మరో ఓటమి తప్పదు.